Mon Dec 23 2024 08:17:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మాజీ మంత్రి మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణించారు. సీతాదేవి విజయ డెయిరీ డైరెక్టర్ గా ఉన్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణించారు. సీతాదేవి విజయ డెయిరీ డైరెక్టర్ గా ఉన్నారు. యెర్నేని సీతాదేవి ఈరోజు ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. సీతాదేవి స్వస్థలం కైకలూరు మండల కోడూరు. ఆమె గతంలో ముదినేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా...
రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీరామారావు మంత్రివర్గంలో యెర్నేని సీతాదేవి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె మృతిపట్ల రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. సీతాదేవి పార్ధీవదేహాన్ని వారి స్వగ్రామం కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం, కొండూరు కు ఈరోజు సాయంత్రం తీసుకొని వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story