Mon Dec 23 2024 09:25:20 GMT+0000 (Coordinated Universal Time)
Assembly : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభయిన వెంటనే తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాగితాలు చించి స్పీకర్ పైకి వేశారు. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు చర్చకుపట్టుబట్టింది. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారంటూ నినాదాలు చేశారు.
ఒకరోజు పాటు...
దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులన సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మూడోరోజు సమావేశాలు ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ నుంచి ఒకరోజు పాటు స్పీకర్ వారిని సప్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా సభ్యులు సభలోనే కొనసాగుతూ నినాదాలు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story