Mon Dec 23 2024 20:32:46 GMT+0000 (Coordinated Universal Time)
మేకను పెళ్లాడిన యువకుడు.. వైరల్ అవుతోన్న వీడియో!
ఓ యువకుడు మేకను పెళ్లాడాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నూజివీడు : దోష నివారణ మేరకు ఓ యువకుడు మేకను పెళ్లాడాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. జాతకం పట్ల ఆ యువకుడికి ఉన్న నమ్మకంతోనే మేకను పెళ్లాడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని అన్నవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ యువకుడు తన జాతకాన్ని చూపించుకోగా.. రెండు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పారట. దాంతో దోష నివారణ చేయించుకోవాలనుకున్నాడు ఆ యువకుడు.
రెండు పెళ్లిళ్లు జరగకుండా పరిష్కారం చూపాలని పూజారులను అడగడంతో.. మొదటి వివాహం మేకతో చేసుకోవాలని సూచించారట. శనివారం ఉగాది సందర్భంగా స్థానిక నవగ్రహ ఆలయంలో అర్చకులు ఆ యువకుడికి మేకతో మొదటి వివాహం జరిపించారు. హిందూ ధర్మంలో వివాహ దోష నివారణకై ఇలాంటి వివాహాలు జరిపించవచ్చని పురాణాల్లో ఉందని పూజారులు చెప్తున్నారు.
Next Story