Mon Dec 23 2024 05:44:52 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ కు తాళికట్టిన యువకుడు.. వైరలవుతోన్న వీడియో
ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడంతో విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. ఏం చేసినా.. పెళ్లయ్యాకేనంటూ బాలిక తల్లిదండ్రులు
ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఎంత అంటే.. మైనర్లుగా ఉన్నప్పుడే.. ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లల్ని కూడా కనేస్తున్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా సహకరిస్తుండటం కొసమెరుపు. అలాంటి ఘటనే.. అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. 24 ఏళ్ల యువకుడు 14 ఏళ్ల మైనర్ కు పబ్లిక్ లో తాళి కట్టడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో 8వ తరగతి చదువుతోన్న 14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నాననంటూ వెంటపడ్డాడు శ్రీకాంత్. అందుకు ఆ బాలిక కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడంతో విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. ఏం చేసినా.. పెళ్లయ్యాకేనంటూ బాలిక తల్లిదండ్రులు కండీషన్ పెట్టారట. అంతే.. ఇక మనోడు ముందు వెనుక ఆలోచించకుండా బాలిక ఇంటికెళ్లి అందరూ చూస్తుండగానే మూడు ముళ్లూ వేసేశాడు. అయితే.. ఈ ఘటనపై బాలిక నుండి గానీ.. ఆమె తల్లిదండ్రుల నుండీ గానీ ఎలాంటి అభ్యంతరం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తాళి కట్టాక.. ఎలా ఉన్నా.. ఏం కాదన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏదైతేనేం.. మైనర్ కు తాళి కట్టడం మాత్రం సంచలనంగా మారింది.
Next Story