Mon Dec 23 2024 01:25:39 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సూర్యలంక బీచ్ లో గల్లంతయిన నలుగురు తెలంగాణ యువకులు
హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్ కు విహార యాత్రకు వచ్చిన యువకులు గల్లంతయినట్లు సమాచారం.
బాపట్ల సూర్యలంక బీచ్ లో యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్ కు విహార యాత్రకు వచ్చిన యువకులు గల్లంతయినట్లు సమాచారం. గల్లంతయిన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాపట్ల జిల్లాలోని నాగరాజు కాల్వలో ఈ ఘటన జరిగిందంటున్నారు.
గాలింపు చర్యలు ప్రారంభం...
బాపట్ల సూర్యలంక బీచ్ కు వచ్చిన నలుగురు యువకులు ఒక కాల్వలో దిగేందుకు ప్రయత్నించగా కొట్టుకుపోయినట్లు స్థానికులు చెప్పారు. అది గమనించిన స్థానికులు వెంటనే కోస్ట్ గార్డ్ లకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే గల్లంతయిన యువకులు హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన వారని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story