Sun Dec 22 2024 03:02:26 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో తెలుగు యువతి మృతి.. రోడ్డు ప్రమాదంలోనే
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువతి మరణించింది. అమెరికాలోని టెన్నెసీలో ఈ ప్రమాదం జరిగింది
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువతి మరణించింది. అమెరికాలోని టెన్నెసీలో ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగశ్రీ వందన పరిమళ ఉన్నత విద్య కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్క టెన్సీనీ రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతుంది. అయితే ఆమె స్నేహితులతో కలసి వెళుతుండగా రాక్ వుడ్ఎవెన్యూ సమపీంలో వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టింది.
ట్రక్ వచ్చి...
ఈ ప్రమాదంలో పరిమళ మరణించారు. ఆమె వయసు 26 ఏళ్లు. ప్రమాదానికి గురైన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న నిఖిత్,పవన్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Next Story