Mon Dec 23 2024 00:09:44 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డి
ఈ క్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారని ఈరోజు ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. అవినాశ్ ఉన్నవిశ్వభారతి ఆస్పత్రికి సీబీఐ అధికారులు చేరుకున్న నేపథ్యంలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగాలేదని ఆమె డిశ్చార్జ్ అయ్యేంతవరకూ విచారణకు హాజరు కాలేనంటూ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ఆయన లేఖను పట్టించుకోని సీబీఐ అధికారులు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ ను అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ బెంచ్ ముందు బెయిల్ పిటిషన్ ఉంచారు. అయితే ఈ పిటిషన్ ను తాము స్వీకరించలేమన్న ధర్మాసనం.. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెెళ్లాలని సూచించింది. దాంతో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అనిరుధ్ బోస్ ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ సంజయ్ కరోల్ లేని ధర్మాసనం ముందు మెన్షన్ చేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో వేరే ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేయనున్నారు.
Next Story