Mon Dec 23 2024 15:38:49 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు
వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 వతేదీన విచారణకు హాజరుకావాలని కోరారు
వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 వతేదీన విచారణకు హాజరుకావాలని కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈరోజు తమ కార్యాలయానికి వచ్చి హాజరుకావాలని తొలుత నోటీసుల్లో పేర్కొంది. అయితే కడపలో వైసీపీ కార్యకర్తల సమావేశం ఉందని తాను ఈరోజు హాజరు కాలేదని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు తెలిపారు. దీంతో పులివెందులలోని ఆ ఇంటికి వెళ్లి మరోసారి నోటీసులు జారీ చేశారు.
భాస్కర్‌రెడ్డికి కూడా...
వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు అతని తండ్రి భాస్కర్రెెడ్డిని కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే భాస్కర్ రెడ్డిని మాత్రం కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. భాస్కర్ రెడ్డిని మాత్రం ఇదే తొలిసారి విచారించడం. అయితే భాస్కర్ రెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story