Mon Dec 23 2024 05:53:42 GMT+0000 (Coordinated Universal Time)
అవినాష్ కు నిరాశ
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి నిరాశ ఎదురయింది
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నిరాశ ఎదుయింది. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌పై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఆదేశాలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది. హైకోర్టు సీబీఐని కట్టడి చేస్తున్నట్లే అనిపిస్తుందని వ్యాఖ్యనించింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన పిటీషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
జూన్ 30వ తేదీ వరకూ...
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కేసును జూన్ 30 వతేదీ లోపు విచారించి ముగించాలని గడువు పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు పూర్తవుతుందని, సమగ్ర విచారణ చేయాలంటే సమయం సరిపోదన్న సీీబీఐ తరుపున న్యాయవాదుల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐ అధికారులు ఎప్పుడో అరెస్ట్ చేసేవారు కదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Next Story