Mon Dec 23 2024 07:14:01 GMT+0000 (Coordinated Universal Time)
దస్తగిరిని అప్రూవర్‌గా వద్దు : వైఎస్ భాస్కర్‌రెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. వివేక హత్య కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్‌రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించడంతో ఆయన ఈ పిటీషన్ వేశారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమను నేరంలోకి లాగడం సమంజసం కాదని తెలిపారు.
సీబీఐ చెప్పినట్లుగానే...
సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని పిటీషన్లో పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వటం సరికాదన్నారు. దస్తగిరికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు
Next Story