Fri Nov 29 2024 03:48:18 GMT+0000 (Coordinated Universal Time)
బటన్ నొక్కడం అందుకే
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హుడైన ప్రతి లబ్దిదారుడికి చేరాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం అర్హుడైన ప్రతి లబ్దిదారుడికి చేరాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వివిధ కారణాల వల్ల లబ్దిపొందని 2,79,065 మంది లబ్దిదారులకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ బటన్ నొక్కి డబ్బులను జమ చేశారు. మొత్తం 590.91 కోట్ల రూపాయలను జగన్ కొద్దిసేపటి క్రితం వివిధ పథకాల కింద ఇప్పటి వరకూ లబ్దిపొందని వారికి జమ చేశారు.
సంక్షేమ పథకాలను...
అర్హత ఉండి పథకాలను కొన్ని కారణాల వల్ల పొందలేని వారికి ఆలస్యంగానైనా గుర్తించి అందచేయడం మంచిదని జగన్ అభిప్రాయపడ్డారు. లంచాలకు తావులేకుండా నేరుగా లబ్దిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే ఈ ప్రభుత్వ బాధ్యత, లక్ష్యంగా ఉండాలని అధికారులకు జగన్ ఉద్భోదించారు. ఏ ఒక్కరికీ పొరపాటు వల్ల అన్యాయం జరగకూడదని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా అన్యాయం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story