Mon Dec 23 2024 11:25:11 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్
. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడలో నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. వైఎస్సార్పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ‘సేవ్ డెమొక్రసీ’ అని నినాదాలు చేస్తూ, అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని పోలీసులు చింపేశారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆ అధికారం ఎవరిచ్చారంటూ.. గట్టిగా పోలీసులను నిలదీశారు.
నల్లకండువాలు ధరించి...
అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని వైఎస్ జగన్ హెచ్చరించారు. పోలీసులు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని, ఆగ్రహం వ్కక్తం చేశారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు.
Next Story