Mon Dec 23 2024 05:07:31 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం లేదు
మచిలీపట్నం సభలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు
మచిలీపట్నం సభలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం సన్నగిల్లుతుందని వైఎస్ జగన్ అన్నారు. ఇష్టమొచ్చినట్లు అధికారులను మార్చేస్తున్నారన్నారు. కావాలనే ప్రజలకు పథకాలకు అందకుండా చేస్తున్నారన్నారు. ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన నిధులను కూడా అడ్డుకుంటున్నారన్నారు.
పేదలకు మంచి చేయకుండా...
పేదలకు మంచిజరుగకుండా ఉండేందుకే ఈ ిఇన్ని కుట్రలు జరుగుతున్నట్లు అర్థమవుతుందని అన్నారు. అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు పడకుండా చేస్తున్నారన్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయని నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు. కేవలం పేదలకు మంచి చేసే జగన్ అధకారంలో ఉండకుండా చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
Next Story