Mon Dec 23 2024 06:26:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్నప్పుడు సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది. ఆ రాయి సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు.
"విజయవాడలో మన నాయకుడు సీఎం @ysjagan గారిపై పచ్చ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు. ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక @JaiTDP పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా @YSRCParty కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు." అంటూ వైసీపీ అధికారిక అకౌంట్ లో పోస్టు పెట్టారు.
Next Story