Thu Nov 14 2024 15:48:27 GMT+0000 (Coordinated Universal Time)
YS Jagan: బెంగళూరుకు వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు. కొద్దిరోజులు ఆయన అక్కడే ఉంటారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ బెంగళూరు వెళ్లడం ఇది రెండోసారి. గత నెల 24న బెంగళూరు వెళ్లిన ఆయన ఈ నెల ఒకటో తేదీ వరకు అక్కడే ఉన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపులో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. అయితే అది కూడా వాయిదా పడింది.
అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతూ ఉండగా వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లడం ఆసక్తికర పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జూన్ 25న తనను సభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి లేఖ రాశారు. 1984లో లోక్సభలో మొత్తం 543 స్థానాలకు గాను టీడీపీకి 30 సీట్లు మాత్రమే వచ్చినా ప్రతిపక్ష నేత హోదా లభించింది. 1994లో, భారత జాతీయ కాంగ్రెస్ (INC)కి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ బలం మొత్తం 294 సీట్లలో 26 మాత్రమే. 2015లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మొత్తం 70 స్థానాల్లో కేవలం మూడింటిని మాత్రమే దక్కించుకున్నా కూడా ప్రతిపక్ష పార్టీ పదవిని ఇచ్చారని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు.
Next Story