Mon Dec 23 2024 00:16:08 GMT+0000 (Coordinated Universal Time)
YS Jagan: రేపు గుంటూరుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు గుంటూరుకు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు గుంటూరుకు వెళ్లనున్నారు. వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3.25 గంటలకు చేరుకుంటారు. 4.05 గంటలకు విమానంలో బయలుదేరి 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను బుధవారం నాడు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. బుధవారం గుంటూరు వెళ్లి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించనున్నారు. నందిగం సురేశ్ను ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నందిగం సురేశ్ ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది. రిమాండ్లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేశ్ కోర్టును ఆశ్రయించారు.
Next Story