Sat Apr 19 2025 08:32:13 GMT+0000 (Coordinated Universal Time)
YSJagan In Delhi: నేడు ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
గత 50 రోజులుగా ఏపీలో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారంటూ

గత 50 రోజులుగా ఏపీలో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ చెబుతోంది. దీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో నేడు నిరసన తెలియజేయనున్నారు. కేవలం 50 రోజుల్లోనే రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. ఈ విషయం దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి వైఎస్ జగన్ ధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దారుణకాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంసకాండపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు సాగిస్తోన్న మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు.
Next Story