Fri Nov 22 2024 20:31:49 GMT+0000 (Coordinated Universal Time)
దత్తపుత్రుడు అంటూ స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం జగన్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని.. ఆయన్ని కాపాడటానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వారికి కూడా ఈ అవినీతి, అక్రమాల్లో వాటా ఉందంటూ ఆరోపించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు.. ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిన వ్యక్తి ఈయన కాదా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు చట్టం అందరికి ఒకటే అని చెప్పే చంద్రబాబు.. ఇప్పుడెందుకు అవినీతి కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారని అన్నారు వైఎస్ జగన్.
చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తికి కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారన్నారు. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని.. దర్యాప్తులో ఐటీ అధికారులు పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని అన్నారు. కోర్టులో పది గంటల పాటు వాదనలు జరిగాయని.. బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సరైన ఆధారాలతో నోటీసులు ఇచ్చారంటూ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టయినా.. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. అవినీతిపరుడికే మద్దతిస్తున్నారని ఆరోపించారు. గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని.. అవినీతిపై ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తారన్నారు. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ జగన్ విమర్శించారు. ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నించకుండా పొత్తు పెట్టుకున్నాడని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.
Next Story