Mon Dec 23 2024 14:35:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫిబ్రవరి 27న వైసీపీలో ఏమి జరగబోతోంది?
ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజలకు దగ్గరవుతూ ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక త్వరలోనే అభ్యర్థులను అధికారికంగా
ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజలకు దగ్గరవుతూ ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక త్వరలోనే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇలాంటి సమయంలోనే సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
రాప్తాడు సభ సక్సెస్ తో జోష్:
వైసీపీ రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ భారీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సభను కూడా సక్సెస్ చేయాలని వైసీపీ వర్గాలు దూసుకుపోతున్నాయి. వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు.
Next Story