Fri Dec 20 2024 08:36:54 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు
విజయవాడ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ స్పందించారు. పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు
విజయవాడ ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. బస్సు ప్రమాదకరం దురదృష్టకరమన్న ఆయన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. విచారణ తర్వాత అసలు విషయం తెలుస్తుందని తెలిపారు. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు.
విచారణకు ఆదేశం...
విజయవాడ జవహర్లాల్ నెహ్రూ పండిట్ బస్టాండ్ లో బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అయితే దీనిపై విచారణ పూర్తి చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. మృతుల కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ప్రకటించారు.
Next Story