Mon Dec 23 2024 10:27:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీడీపీ మ్యానిఫేస్టోలో మోదీ ఫొటోలేకపోవడానికి అదే కారణమా?
మోదీ ఫొటోను మ్యానిఫేస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని వైఎస్ జగన్ అన్నారు
మోదీ ఫొటోను మ్యానిఫేస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని వైఎస్ జగన్ అన్నారు. మూడు పార్టీలు కూటమిలో ఉన్నప్పటికీ మోదీ ఫొటో ఎందుకు లేదని జగన్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి మ్యానిఫేస్టోలో తన ఫొటో పెట్టవద్దని ఫోన్ రాబట్టే మ్యానిఫేస్టోలో ఫొటో పెట్టలేదన్నారు. ముగ్గురు కూటమిలో ఉంటే ఇద్దరు ఫొటోలను మాత్రమే ఎందుకు పెట్టారో అందరూ అర్థం చేసుకుంటారని ఆయన తెలిపారు.
హామీలు అమలు చేసే వ్యక్తి కాదనే...
చంద్రబాబు వాగ్దానాలను అమలు చేసే వ్యక్తి కాదని మోదీకి కూడా తెలిసిందని, అందుకే నాడు రాజధాని నిర్మాణం అంటూ హడావిడి చేసి తాత్కాలిక నిర్మాణాలు చేసి తన పేరు బద్నాం చేశాడని మోదీ భావించబట్టే మోదీ ఈసారి మ్యానిఫేస్టోలో ఫొటో పెట్టకుండా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. కనీసం మ్యానిఫేస్టోను కూడా పక్కనే ఉన్న బీజేపీ నేత పట్టుకోలేదంటే కూటమిలో ఉన్న పార్టీలకే చంద్రబాబు పై నమ్మకం లేదని, ఇక జనాలకు ఎందుకు ఉండాలని జగన్ ప్రశ్నించారు.
Next Story