Mon Dec 23 2024 11:22:22 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : కాకినాడ సభలో జగన్ వేసిన ప్రశ్నలివే.. సమాధానాలు చెప్పాలంటూ
ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేయాలని వైఎస్ జగన్ అన్నారు. కాకినాడ సభలో ఆయన ప్రసంగించారు.
ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేయాలని వైఎస్ జగన్ అన్నారు. కాకినాడలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జైత్రయాత్రకు సిద్ధమంటూ ప్రజలంతా సింహగర్జనకు సిద్ధమవుతున్నారని అన్నారు. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్క్ పాలన వస్తుందన్నారు. మళ్లీ కత్తిరింపులు వస్తాయన్నారు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే అవ్వాతాతలకు ప్రతి నెల మొదటో తేదీ పించను అందుతుందన్నారు. పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలని జగన్ పిలుపు నిచ్చారు. ఫ్యాన్ కు ఓటేస్తేనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుందని తెలిపారు. ఫ్యాన్ కు ఓటేస్తేనే వాలంటీర్లు వచ్చి పౌరసేవలు అందిస్తారన్నారు. జగన్ మార్క్ పథకాలు అందాలంటే ఫ్యాన్ కు ఓటేయాలన్నారు.
లేదంటే అన్నీ...
లేదంటే అన్నీ రద్దవుతాయని అన్నారు. అమ్మవొడి, విద్యాకానుక, గోరుముద్ద రద్దవుతాయని, కత్తిరింపులు, ముగింపు అని అన్నారు. పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా రాదన్నారు. పొరపాటు జరిగిందంటే చంద్రముఖి నిద్రలేస్తుందని, మీపిల్లల చదువులు, మీ పిల్లల బడులను లకకక అంటూ ముగింపు అని అన్నారు. ఫ్యాన్ కు ఓటేస్తేనే గ్రామాల్లో విలేజ్ క్లినిక్ అని, ఇంటివద్దకే ఫ్యామిలీ డాక్టర్ అని అన్నారు. ఇరవై ఐదు లక్షల వరకూ ఉచితం ఆరోగ్య శ్రీ అందుతుందన్నారు. మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల భవిష్యతకు పునాది వంటిదని అన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తేనే జగన్ మార్కు పాలన కొనసాగుతుందన్నారు.
మంచి జరిగితేనే...
మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని జగన్ కోరారు. ఫ్యాన్ కు ఓటువేస్తేనే సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ లభిస్తుందన్నారు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు అని అన్నారు. ఫ్యానుకు ఓటు వేస్తేనే అందరికీ ఇళ్లపట్టాలు.. సొంత ఇళ్లు అని అన్నారు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కుతాయని అన్నారు. అక్కచెల్లెమ్మలకు గత ఎన్నికల్లో పొదుపు సంఘాలకు చంద్రబాబు చేసిన మోసం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. మీకు మంచిచేసిన మీ బిడ్డ కావాలా? లేక రాష్ట్రాన్ని నలుగురి కోసం దోచుకునే చంద్రబాబు పాలన కావాలా?అని ప్రశ్నించారు.
ప్యాకేజీస్టార్ ను కూడా...
వైసీపీ పాలనలో గత ఎన్నికల్లో ఓటు వేయకపోయిన వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామన్నారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని పథకాలను అందించామని తెలిపారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలు మీకు నిజాలే చెబుతాయని అన్నారు. ఆలోచనచేసి ఓటు వేయాలని జగన్ కోరారు. ఎవరు ఉంటే మంచి జరుగుతుందని ఆలోచని చేసి మరీ ఓటు వేయాలని కోరారు. ఇంటింటికీ మంచి చేశాం కాబట్టే ఒంటరిగా ఎన్నికల్లో యుద్ధానికి బయలుదేరానని, అందరినీ మోసం చేశాడు కాబట్టే కూటమితో వస్తున్నాడని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కూటమిలో మిగిలిన పార్టీల్లోకి తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అని అన్నారు. దత్తపుత్రుడికి ఎన్ని సీట్లు ఇవ్వాలో? ఎవరికి సీటు ఇవ్వాలో నిర్ణయించేది కూడా చంద్రబాబు అని అన్నారు. ప్యాకేజీ స్టార్ ను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీచేస్తారన్నారు. పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగు మార్చారన్నారు.
Next Story