Sun Dec 14 2025 03:50:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మోసపు వాగ్దానాలతో ఆయన మళ్లీ వస్తున్నాడన్నా
చంద్రబాబు మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలు అమలు కావాలంటే లక్షల కోట్లు కావాలని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబు మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలు అమలు కావాలంటే లక్షల కోట్లు కావాలని వైఎస్ జగన్ అన్నారు. బొబ్బిలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అది సాధ్యం కాదని అధికారంలోకి రావడానికి మాత్రమే ఇలాంటి హామీలు ఇచ్చారని జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ చేస్తున్న మంచి పనులు చూడలేక తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక తనను చంపుతానని చెప్పడం ఎంతవరకూ సమంజమని అన్నారు. ఇది చంద్రబాబు నేర ప్రవృత్తికి అద్దంపడుతున్నాయని ఆయన తెలిపారు. పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలవా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు.
మళ్లీ ఆయనే వస్తే...
ీఅవ్వాతాతలు, అక్కా చెల్లెళ్ల దీవెనలే తనకు శ్రీరామ రక్ష అని జగన్ అన్నారు. చంద్రబాబు మాటలు నమ్మితే మళ్లీ మోసపోయినట్లేనని జగన్ అన్నారు. 2014లో ఆయన ఇచ్చిన మ్యానిఫేస్టోలో ఒక్కటయినా ఇచ్చారా? అంటూ జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, వారిని నమ్మగలమా? అని ప్రశ్నించారు. మళ్లీ ఈ ముగ్గురే మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటూ మీ ముందుకు వస్తున్నారని అన్నారు. అబద్ధాలు, మోసాలతో మనం యుద్ధం చేస్తున్నామని, వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మళ్లీ వైసీపీకే ఓటు వేయాలని కోరారు. రెండు బటన్ లు ఫ్యాన్ పై నొక్కాలని ఆయన అన్నారు.
Next Story

