Mon Dec 23 2024 08:13:09 GMT+0000 (Coordinated Universal Time)
2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు : తేల్చి చెప్పిన సీఎం జగన్
బుధవారం పార్టీ కీలక నేతలతో సమావేశమైన సందర్భంగా జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 10 నుంచి గడపగడపకూ వైసీపీ..
తాడేపల్లి : వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని, గెలవలేని వారిని పక్కన పెట్టేస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. బుధవారం పార్టీ కీలక నేతలతో సమావేశమైన సందర్భంగా జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 10 నుంచి గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాతమంత్రులు, జిల్లా అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెట్టనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఎవరికైనా పార్టీనే సుప్రీం అని చెప్పిన జగన్.. గెలిచిన వారినే మంత్రి పదవులు వరిస్తాయని చెప్పడం కొసమెరుపు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు కావాల్సిన వనరులను సమకూరుస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ ఒక్కరు కూడా తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని కూడా జగన్ హెచ్చరించారు. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సూచించారు.
Next Story