Fri Dec 20 2024 05:32:32 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు పిఠాపురానికి జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రచారానికి చివరి రోజున ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని కీలకమైన నియోజకవర్గాల్లో చేసి ముగించనున్నారు. గత నెల 27వ తేదీ నుంచి వరస సభలతో నియోజకవర్గాలను చుట్టివస్తున్న జగన్ నేటితో ప్రచారానికి ముగింపు పలికి ఎలక్షనీరింగ్ పై దృష్టి పెట్టనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాలను పర్యటిస్తూ జగన్ ప్రజలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. నమ్మకమే తనను గెలిపిస్తుందన్న భావనలో ఉన్నారు.
మూడు నియోజకవర్గాల్లో...
ఈరోజు వైఎస్ జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రచారంలో పాల్గొంటారు. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఎన్నికల ప్రచారం ముగించే రోజు ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ ను ఓడించాలన్న లక్ష్యంతో పిఠాపురంలో నేడు ఆఖరి అస్త్రాన్ని సంధించనున్నారు. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం నియోజకవర్గాల్లో ఈరోజు ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story