Sun Dec 22 2024 15:44:18 GMT+0000 (Coordinated Universal Time)
Supreme Court : జగన్ సర్కార్ కు సుప్రీం ఝలక్
జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ తవ్వకాలు...
ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలను మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీ లోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ మే 10వ తేదీకి వాయిదా వేసింది.
Next Story