Mon Dec 23 2024 09:04:25 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలా నువ్వు నోరు మూసుకుంటే మంచిది : విమలమ్మ
వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ తీవ్ర విమర్శలు చేశారు
వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరూ వైఎస్ కుటుంబం పరువును బజారు కీడుస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిని చంపుతుండగా వీళ్లిద్దరూ చూశారా? అంటూ ఆమె ప్రశ్నించారు. లేని పోని నిందలు వేయడం తగదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వాళ్లు బయట తిరుగుతున్నారన్నారు. వాళ్లు వైఎస్ కుటుంబ ఆడపడుచులయితే తాను ఆడపడచుగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు.
అనవసర వివాదంలోకి...
అనవసర వివాదంలోకి జగన్ ను లాగే ప్రయత్నం చేస్తున్నారని విమలమ్మ అన్నారు. రాజకీయంగా జగన్ ను ఇబ్బంది పెట్టేందుకే ఈ రకమైన ఆరోపణలు అక్కా చెల్లెళ్లు చేయడం సరికాదని విమలమ్మ అన్నారు. షర్మిల, సునీత కలసి రోడ్డు మీదకు వచ్చి విమర్శలు చేయడం చూస్తుంటే వీళ్లేనా వైఎస్ కుటుంబ సభ్యులు అనిపిస్తుందని అని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎందుకు హత్యచేశారు? ఎవరు హత్య చేశారో? సీబీఐ తేల్చాలని, అంత వరకూ ఎవరిపై నిందలు వేయడం మానుకోవాలని విమలమ్మ హితవు పలికారు.
Next Story