Thu Dec 19 2024 00:16:09 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : జగన్ ఇంటికి షర్మిల.. అన్నా వదిలకు ఆహ్వానం
వైఎస్ షర్మిల విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు.
వైఎస్ షర్మిల విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు కూడా వెంట ఉన్నారు. తన కుమారుడి నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను తన సోదరుడు జగన్ కు అందచేయడానికి వచ్చారు. వదిన భారతిని కలసి నిశ్చితార్ధానికి రావాలని ఆహ్వానించనున్నారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి తో ప్రియా అట్లూరి తో నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఆమె ప్రత్యేకంగా విజయవాడకు వచ్చారు.
ఇక్కడి నుంచి నేరుగా...
షర్మిలను వైఎస్ జగన్ సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. ఈ నెల 18వ తేదీన రాజారెడ్డి నిశ్చితార్ధం జరగనుంది. వచ్చేనెల 17 వతేదీన వివాహం జరగనుంది. అయితే సుదీర్ఘకాలం తర్వాత వైఎస్ షర్మిల తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ గత కొంత కాలంగా రాజకీయంగా వేర్వేరు దారుల్లో పయనిస్తుండటంతో ఈ భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. వివాహానికి అందరినీ ఆహ్వానించడానికే ఇక్కడకు వచ్చానని షర్మిల తెలిపారు. తాడేపల్లిలో జగన్ దంపతులను కలసిన తర్వాత ఆమె నేరుగా నోవాటెల్ హోటల్ లో విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆమె విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Next Story