Thu Dec 19 2024 17:57:34 GMT+0000 (Coordinated Universal Time)
YSSharmila: ఎమోషనల్ అయిన షర్మిల.. కన్నీళ్లు పెట్టుకోవడంతో
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు
YSSharmila:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ జీవితాలను అంకితం చేస్తామని ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసిన అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. మంగళగిరిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని.. అందుకే తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధించుకోవడానికే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ జీవితాలు, కెరీర్లు అంకితం చేశారని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలపై తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకుపడ్డారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం, వెన్నుపోటు పొడచడం ఈ పార్టీలకు అలవాటైపోయింది. కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలను పెంచడానికి ప్రయత్నిస్తున్న పార్టీలకు, కాంగ్రెస్ ఈ సందేశాన్ని గట్టిగా, బలంగా అందిస్తోంది. 5.5 కోట్ల ప్రజలకు లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే కులం లేదా మతం. కాంగ్రెస్ తిరుగులేని స్పూర్తితో పోరాడుతూనే ఉంటుంది. ఈ పార్టీల మోసాన్ని బట్టబయలు చేస్తుందని ఆమె అన్నారు. షర్మిలా కళ్లలో నీళ్లు రావడంతో పలువురు కార్యకర్తలు, మద్దతుదారులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పల్లంరాజు, జెడి శీలం, జి.రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Next Story