Sun Dec 22 2024 22:21:18 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల.. ఏఐసీసీ కీలక ప్రకటన
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అనుకున్నదే అయినా ఇంత త్వరగా ఈ ఉత్తర్వులు వెలువడతాయని ఎవరూ ఊహించలేదు. అయితే నిన్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామాతో ఆమె నియామకం ఖారారయిందన్న వార్తలు వచ్చాయి.
రుద్రరాజు రాజీనామాతో...
ఈ పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల ను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పీసీీసీ చీఫ్ బాధ్యతలను అప్పగిస్తారని భావించారు. గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. దీంతో షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను త్వరలో తీసుకోబోతున్నారు.
Next Story