Thu Apr 17 2025 06:15:30 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : చంద్రబాబు ప్రభుత్వం పై వైఎస్ షర్మిల కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఏపీ ఉందని అన్నారు. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అని అన్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదని షర్మిల అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని అన్నారు. రైతులను పట్టించుకొనే దిక్కు లేదని, కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపారన్నారు.
గిట్టుబాటు ధర లేక...
నేడు గిట్టుబాటు లేక అల్లాడుతున్నారని, మిర్చి రైతు విలవిలాడుతుంటే.. కంది రైతు కంట కన్నీరు పెడుతున్నారని, కూరగాయల ధరలకు మార్కెట్ లో రెక్కలొస్తున్నా రైతుకు పెట్టుబడి మందం మాత్రం అందక పండిన పంటకు నిప్పు పెట్టుకొనే దీనస్థితిలో ఉన్నారన్నారు. ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత పదేళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయన్న వైఎస్ షర్మిల చంద్రబాబు మొదటి ఐదేళ్లు ఏడాదికి ఐదు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మాట తప్పితే జగన్ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు. ఇద్దరు కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారని షర్మిల ఆరోపించారు.
Next Story