Sun Dec 22 2024 21:06:49 GMT+0000 (Coordinated Universal Time)
డేట్-టైమ్ చెప్పమని సవాల్ విసిరిన షర్మిల
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఆమె పలాసలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. మధ్యలో బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల ఆరా తీశారు.
షర్మిల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి షర్మిలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి అనడంపై సుబ్బారెడ్డి అభ్యంతరం చెబితే తనకు జగనన్న అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తనను పక్క రాష్ట్రం నుంచి వచ్చానని సుబ్బారెడ్డి అనడంపై స్పందించిన షర్మిల వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు అభివృద్ధి చూపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాలు చేశారు. అభివృద్ధిని చూడ్డానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి, ప్లేస్ టైమ్ మీరే ఫిక్స్ చేయాలని, తనతో పాటు మేధావులు, మీడియా కూడా వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించాలని కోరారు. తామంతా ఎక్కడికి రావాలో టైమ్, ప్లేస్ వారు చెబితే వచ్చి చూస్తామని షర్మిల ప్రకటించారు.
Next Story