Thu Dec 26 2024 00:24:31 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వరద ప్రాంతాల్లో పర్యటించారా? బాధితులను ఆదుకోరా?
ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు
దాదాపు మూడు వారాల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుందని, ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసిందని, మరి ఏపీకి ఎందుకు ఇవ్వదని ఆమె నిలదీశారు
ఎందుకింత వివక్ష...
ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? అని నిలదీశారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, మరి ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత లేదు? ఇవన్నీ వదిలేసి, పునరావాస కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడుతూ, కనీసం ఎప్పుడు పర్యటిస్తారో కూడా చెప్పకపోవడం ప్రజల్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, ప్రతి రైతు ఎకరానికి రూ.15000 రూపాయలు ఖర్చుపెట్టాడని, అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా జరిగింది. మొత్తం నష్టం కలిపి సుమారు రూ.800 కోట్లు ఉంటుందని ఆమె అన్నారు.
Next Story