Thu Dec 19 2024 19:06:04 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమెను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు
వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమెను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈరోజు నిరుద్యోగులకు మద్దతుగా చలో సెక్రటేరియట్ కు పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచే పోలీసులు ఆంధ్రరత్న భవన్ వద్ద పోలీసులు మొహరించారు. రాత్రికి వైఎస్ షర్మిల అక్కడే బస చేశారు. దీంతో ఆమెను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
చలో సెక్రటేరియట్...
ఆంధ్రరత్న భవన్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వైఎస్ షర్మిల మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపడతామని తెలపడంతో పోలీసులు మరింతగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తనున్నాయి. పెద్దయెత్తున పోలీసులు మొహరించి అటువైపు నుంచి ఎవరినీ రానివ్వడం లేదు.
Next Story