Ys Sharmila : వైఎస్ షర్మిలపై నేతలు గుర్రుమంటున్నారా? సొంత పార్టీ నేతలే రివర్స్ అయ్యారా?
పార్టీ చీఫ్ గా అందరినీ కలుపుకుని పోవాల్సిన వైఎస్ షర్మిల నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అందరినీ కలుపుకుని పోలేక పోతున్నారా? ఉన్న నలుగురి నేతలతో ఆమె సఖ్యతగా ఉండలేకపోతున్నారా? అంటే అదే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా అందరినీ కలుపుకుని పోవాల్సిన వైఎస్ షర్మిల నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలే ఆరోపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదీ పార్టీ నేతలతో మాట్లాడరు. తాను అనుకున్న పని చేస్తారు. తనకు ఇష్టమొచ్చినట్లు ఒక మీడియా సమావేశం పెడతారు. లేదంటే హైదరాబాద్‌కే పరిమితమవుతారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చిన వైఎస్ షర్మిల ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రతిపక్షాన్ని విమర్శించి ఏదో టైమ్ పాస్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై మూడు రోజుల ఆందోళనకు పిలుపు నిచ్చిన వైఎస్ షర్మిల మమ అనిపిస్తున్నారు. ఒక రోజు ధర్నా, మరుసటి రోజు లాంతర్లతో నిరసన అంటున్నారు తప్పించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు నేతల నుంచి వినిపిస్తున్నాయి.