Mon Dec 23 2024 06:01:58 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : 21న పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఈ నెల 21న బాధ్యతలను స్వీకరించనున్నారు
వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఈ నెల 21న బాధ్యతలను స్వీకరించనున్నారు. 21వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ లో ఆమె పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో ఇటీవల విలీనం చేసిన వైఎస్ షర్మిలను ఆ పార్టీ హైకమాండ్ ఏపీసీసీ చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే.
నేతల చేరికలు కూడా...
ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా నియమితులు కావడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె ఈ నెల 21వ తేదీన బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొందరు నేతలు ఆమె సమక్షంలో పార్టీలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు చేరే అవకాశముంది.
Next Story