Sat Mar 29 2025 10:01:41 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు ఉత్తరాంధ్రకు వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. న్యాయం కోసం పేరిట షర్మిల యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.

వైఎస్ షర్మిల నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. న్యాయం కోసం పేరిట షర్మిల యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా షర్మిల వరసగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో నేడు ఉత్తరాంధ్రలో షర్మిల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు అనకాపల్లి, మన్యం జిల్లాల్లో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.
మూడు నియోజకవర్గాల్లో...
ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం పాడేరులో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు అరకులో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story