Sun Dec 22 2024 22:28:49 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sunitha : పులివెందుల వీధుల్లో వైఎస్ సునీత ప్రచారం
పులివెందులలో వైఎస్ జగన్ ను ఓడించే లక్ష్యంతో వైఎస్ సునీత ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో ఆమె వీధివీధికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పులివెందులలో వైఎస్ జగన్ ను ఓడించే లక్ష్యంతో వైఎస్ సునీత ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో ఆమె వీధివీధికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారని పదే పదే ఆరోపిస్తున్న వైఎస్ సునీత కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని నడుంబిగించారు.
అవినాష్ ను ఓడించాలంటూ...
అందులో భాగంగా పులివెందుల మెయిన్ బజార్ లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ సునీత నిర్వహిస్తున్నారు.షర్మిల ను అఖండ మెజార్టీతో గెలిపించి న్యాయం చేయాలని ఆమె అందరినీ అభ్యర్థిస్తున్నారు. దుకాణాదారులను కలసి ఓటు వేయాలని కోరుతున్నారు. వైఎస్ సునీత చేస్తున్న ప్రచారాన్ని అక్కడి ప్రజలు కూడా ఆసక్తితో చూస్తున్నారు.
Next Story