Mon Dec 23 2024 16:59:42 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు సునీత
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం రేపు సునీత పిటీషన్ విచారిస్తామని పేర్కొంది.
అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్...
వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు మాత్రం హాజరు కావాలని కోరింది. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Next Story