Sun Dec 22 2024 07:35:47 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్యపై సజ్జల సంచలన కామెంట్స్
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా చంద్రబాబు కారణమని అందరికీ తెలుసునని అన్నారు. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుండాలన్నారు. వైఎస్ వివేకా లేకపోవడం వైసీపీకి ఎదురుదెబ్బ అని అన్నారు. ఇప్పటికీ వైఎస్సార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడి అపహాస్యం పాలవుతున్నారని చెప్పారు. హార్ట్ ఎటాక్ అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
సాక్ష్యాలను తారుమారు చేస్తారా?
వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని చెప్పారు. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేరన్నారు. తాము సీబీఐ విచారణను మాత్రమే తప్పు పట్టామని సజ్జల చెప్పారు. ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలను సీీబీఐ పట్టించుకోదా? అని సజ్జల ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు శివప్రకాష్ రెడ్డి సమాచారం ఇచ్చిన మీదటే అవినాష్ రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల చెప్పారు. ఆ సమయంలో తెలుగుదేశం అధికారంలో ఉందని, దర్యాప్తు చేయించాల్సిన ప్రభుత్వం ఏంచేస్తుందని ప్రశ్నించారు.
Next Story