Mon Dec 23 2024 10:50:59 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును మరో రాష్ట్రంలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును మరో రాష్ట్రంలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దర్యాప్తు సంస్థ అధికారులను సాక్షులు బెదిరిస్తున్నారని, ఇతర రాష్ట్రంలో ఈ కేసు విచారణ చేపట్టాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులను కూడా కోరింది.
ఇతర రాష్ట్రాలకు...
కర్ణాటకకు బదిలీ చేయాలని సీబీఐ సుప్రీంకోర్టు అభ్యర్థించింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం వద్దని కోరింది. అయితే సునీత తరుపున న్యాయవాదులు మాత్రం తెలంగాణలో విచారించినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఈ హత్య కేసు విచారణలో జాప్యంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story