Mon Dec 23 2024 12:35:23 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు... జగన్ హత్యకు?
వైసీపీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ హత్యకు కుట్ర జరుగుతుందని చెప్పారు
వైసీపీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. జగన్ ను హత్య చేసి టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటుందని తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. హింసారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఉన్నంత కాలం తమకు అధికారం దక్కదని భావించిన టీడీపీ ఆ దిశగా కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు.
హత్యా రాజకీయాలకు...
ఇటీవల చంద్రబాబు జగన్ గాల్లో కలసి పోతారని వ్యాఖ్యానించిన విషయాన్ని తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలను చంపితే యాభై లక్షలు ఇస్తానని తెలంగాణకు చెందిన మల్లాది వాసు వ్యాఖ్యలను కూడా ఆయన మననం చేసుకున్నారు. స్కిల్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ లో 243 కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
Next Story