Sun Dec 22 2024 13:42:06 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.
Delhi liqour scam: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహస్తున్నారు. రాజాజీ వీధిలోని ఆయన నివాసంలోనూ, మాగుంట కుటుంబానికి చెందిన లీలా మహల్ లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని మాగుంట నివాసాల్లో సోదాలు చేస్తుంది. నలభైకి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తుంది.
ఐదు రాష్ట్రాల్లో....
మాగుంట కుటుంబం తొలి నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ సోదాలను ఈడీ నిర్వహిస్తుంది. ఉదయం నుంచి ఐదు రాష్ట్రాల్లో ఈడీ ఈ దాడులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, చెన్నై, బెంగళూరు రాష్ట్రాల్లో ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లింకుల కోసం ఈడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాగుంట ఇళ్లతో పాటు మరికొందరు మద్యం వ్యాపారుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.
Next Story