Sun Dec 22 2024 20:07:46 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే.. పార్టీలో చేరేందుకు
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం గెలిచారు. అయితే ఇటీవల వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల మార్పులు, చేర్పులలో భాగంగా ఆయనను తిరుపతి పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించింది.
టీడీపీలో చేరేందుకు...
తనను సత్యవేడు నుంచి బయటకు పంపడానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమంటూ కోనేటి ఆదిమూలం ఫైర్ అయ్యారు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 4 లేదా ఐదో తేదీన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ముందుగా లోకేష్ ను కలిశారు. ఆయనకు సత్యవేడు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
Next Story