Fri Nov 22 2024 08:18:47 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ కూడా బ్లాస్టింగ్ న్యూస్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు మధ్యాహ్నం బ్లాస్టింగ్ న్యూస్ ను విడుదల చేస్తామని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు మధ్యాహ్నం బ్లాస్టింగ్ న్యూస్ ను విడుదల చేస్తామని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ పోస్టు కూడా సంచలనమే అయింది. ట్రూత్ బాంబ్ అంటూ చేసిన పోస్టు ఏంటన్నది ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. వైెసీపీ అధినేత వైఎస్ జగన్ ఏదైనా ప్రకటన చేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దేనిపై ఆయన ట్రూత్ బాంబ్ వదలబోతున్నారన్నది చర్చగా మారింది. ప్రిపేర్ ఫర్ ది బిగ్ రివీల్ అంటూ వైసీపీ అధికార పోస్టులో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బిగ్ ఎక్స్పోజ్ అని టీడీపీ ట్వీట్ చేస్తే దానికి ప్రతిగా బిగ్ రివీల్ అంటూ వైసీపీ కూడా పోస్టు చేసింది
జగన్ స్వయంగా...
రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజకీయంగా ఏదో ఒక ప్రకటన రెండు వైపుల నుంచి వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది. అది ఏ రకంగా ఉంటుంది? ఎవరిపైనా ఉంటుంది? టీడీపీ చేసింది నిజమా? లేక వైసీపీ చేసిన పోస్టు నిజమా? అనేది తెలియని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ ఏదో ఒక విషయంలో నిజాలను బయటకు తెచ్చి దానిని పెట్టే అవకాశాలున్నాయని తెలిసింది. అది దేనిపై ఉంటుందా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలు కీలక నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయాలపై...
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో లొసులుగున్నాయంటూ ఏదైనా జగన్ ప్రకటన చేస్తారా? లేక తమపై ఆరోపణలు చేసిన అనేక విషయాలపై ఆయన స్పందిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ వివాదం చోటు చేసుకుంది. దానిపై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించింది. దానిపై కోర్టులో ఉన్న అంశం కాబట్టి ప్రకటన చేసే అవకాశం లేదు. అదే సమయంలో మద్యం పాలసీని కొత్తగా ప్రభుత్వం అమలులోకి తెచ్చారు. ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చారు. వీటిలో ఏదో ఒక దానిపై జగన్ ప్రకటన చేస్తారా? అన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇటు టీడీపీ, అటు వైసీపీలు రెండు పోటాపోటీగా తమ ఎక్స్ ఖాతాలో బిగ్ న్యూస్ అంటూ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలు అంటూ ప్రకటించడం ఉత్తుత్తికేనా? లేక నిజంగానా? అని మాత్రం చర్చ జరుగుతుంది.
Next Story