Mon Dec 23 2024 10:01:45 GMT+0000 (Coordinated Universal Time)
Visakha Mlc Election : విశాఖ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ నామినేషన్ ఒక్కటే మిగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలోకి దిగకకపోవడంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు.
తన నామినేషన్ ను...
ఈరోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఒక్కరే అభ్యర్థిగా మిగిలారు. దీంతో అధికారులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు ప్రకటించే అవకాశాలున్నాయి
Next Story