Sun Dec 14 2025 23:23:50 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రీకొడుకులిద్దరివీ ఏడుపు రాజకీయాలే
మహానాడులో అన్నీ అబద్దాలే చెప్పారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

మహానాడులో అన్నీ అబద్దాలే చెప్పారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహానాడును చూసి టీడీపీ నేతలు తెగ సంతోష పడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే మహానాడు ఏర్పాటు చేసినట్లుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు చెబుతూ మహానాడును ముగించారని సజ్జల తెలిపారు. సామాజిక న్యాయ బస్సు యాత్రను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రభుత్వంపై పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు.
హుందాతనం ఏదీ?
సీఎం జగన్ హుందాగా వ్యవహరించే వ్యక్తి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబులా జగన్ ప్రగల్బాలు పలికే వ్యక్తి కాదని ఆయన తెలిపారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దావోస్ గతంలో వెళ్లిన చంద్రబాబు ఏం చేసుకు వచ్చారని సజ్జల ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ దావోస్ పర్యటనపై పడి తండ్రీకొడుకులిద్దరూ ఏడుస్తున్నారని విమర్శించారు. విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరని, ఆయన పని అయిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేకూర్చే పథకాలను చంద్రబాబు ఒక్కటైనా తీసుకు వచ్చారా? అని సజ్జల ఆయన ప్రశ్నించారు.
Next Story

