Sun Dec 22 2024 17:16:57 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. కార్యాలయాల కూల్చివేతపై పార్టీ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆపార్టీ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హైకోర్టు స్టేటస్ కో విధించింది. తాము అన్ని అనుమతులను తీసుకునే నిర్మాణాలను కొన్నిచోట్ల చేపట్టామని, కొన్ని చోట్ల అనుమతులకు దరఖాస్తు చేశామని, నిబంధనలను అవసరమైతే అతిక్రమిస్తే జరిమానాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ తరుపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
రాజకీయకక్షతోనే...
ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను రాజకీయ కక్షతోనే కూల్చివేతలను జరుగుతున్నాయని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెలిపారు.అయితే దీనిపై ప్రభుత్వం తరుపున న్యాయవాదులు తాము కూల్చివేయాలని అనుకోవడం లేదని తెలిపారు. అనుమతులు తీసుకోని, నిబంధనలను పాటించని కేవలం నోటిసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. అయితే దీనిపై ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ స్టేటస్ కో విధించాలని చెప్పింది. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది.
Next Story