Mon Dec 23 2024 08:39:21 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మరో జాబితా విడుదల.. 27 స్థానాల్లో అభ్యర్థుల మార్పు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలోనూ అనేక మార్పులు చేసింది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలోనూ అనేక మార్పులు చేసింది. నియోజకవర్గాల ఇన్ఛార్జులను మారుస్తూ వైసీీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. రెండో జాబితాలోనూ కొందరికి నియోజకవర్గాలు మార్చగా, మరికొందరికి మాత్రం టిక్కెట్లు ఇవ్వలేమని తేల్చి చెప్పడం విశేషం. రెండో విడత జాబితాలో ఉభయగోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.
తొలుత పెద్దలతో...
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తొలుత పార్టీ పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, మిధున్ రెడ్డిలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమావేశమై ఏ పరిస్థితుల్లో నియోజకవర్గాలను మారుస్తుందీ వివరిస్తున్నారు. ఆ తర్వాతనే జగన్ తో సమావేశానికి వీరు పంపుతున్నారు. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి నేరుగా జనంలోకి వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా టిక్కెట్ల కేటాయింపు జరుగుతుంది.
హామీలు ఇస్తూ...
తొలి విడత జాబితాలో పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చేశారు. వీరిలో కొందరికి స్థాన చలనం కలిగించగా, కొందరికి సీట్లు ఇవ్వలేమని చెప్పారు. ఇందులో మంత్రులు కూడా ఉన్నారు. అలాగే సీట్లు దక్కని వారికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఇస్తామని చెబుతుండటం విశేషం. ఎవరినీ వదులుకోనని, గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులు తప్పవని, పార్టీ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని జగన్ స్వయంగా కోరుతున్నట్లు తెలిసింది. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా జగన్ ఎక్కువగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు కనపడుతుంది. రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
సెకండ్ లిస్ట్ లో వీరు...
పెనుకొండ - ఉషశ్రీ చరణ్
అనంతపురం పార్లమెంటు - శంకరనారాయణ
హిందూపురం పార్లమెంటు - శాంతమ్మ
అరకు పార్లమెంటు - భాగ్యలక్ష్మి
ఎర్రగొండపాలెం - తాటిపర్తి రాజశేఖర్
ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్
గుంటూరు ఈస్ట్ - షేక్ నూర్ ఫాతిమా
మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి
కల్యాణదుర్గం - తలారి రంగయ్య
అరకు అసెంబ్లీ - గొడ్డేటి మాధవి
విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాసరావు
పిఠాపురం - వంగా గీత
రాజాం - తాలే రాజేష్
ప్రత్తిపాడు - వరపుల సుబ్బారావు
తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి
రాజమండ్రి సిటీ - మార్గాని భరత్
రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాశ్
పాడేరు - మత్స్యరాస విశ్వేశ్వరరాజు
విజయవాడ వెస్ట్ - షేక్ అసీఫ్
కర్నూలు ఎంపీ - గుమ్మనూరు జయరాం
చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
చిత్తూరు - విజయానందరెడ్డి
కదిరి - మక్బుల్ అహ్మద్
అనకాపల్లి - మలకాపల్లి భరత్ కుమార్
జగ్గంపేట - తోట నరసింహం
పాయకరావు పేట - కంబాల జోగులు
రాజమండ్రి రూరల్ - వేణుగోపాల కృష్ణ
పి. గన్నవరం - వేణుగోపాల్
పోలవరం - తెల్లం రాజ్యలక్ష్మి
Next Story