Fri Dec 20 2024 07:50:50 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నానికి షాక్... వారిద్దరూ జనసేనలోకి
గుడివాడలో కొడాలి నానికి వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు. వారు జనసేనలో చేరారు.
గుడివాడలో కొడాలి నానికి వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు. వారు జనసేనలో చేరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గుడివాడలో పాలంకి బ్రదర్స్ గా పేరున్న సారధి బాబు, మోహన్ బాబు వైసీపీని వీడి జనసేనలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారిద్దరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారికి జనసేన సభ్యత్వం ఇచ్చారు.
పవన్ ను విమర్శిస్తున్నందుకే...
2019 నుంచి పాలంకి బ్రదర్స్ వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే కొడాలి నాని పవన్ కల్యాణ్ పై చేస్తున్న విమర్శలను వారు సహించలేక పార్టీని వీడినట్లు చెబుతున్నారు. జనసేనలో చేరిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము కొడాలి నాని విజయానికి పనిచేశామని, అయితే నాని శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలు తమను బాధించాయని చెప్పారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, రాజకీయ విమర్శలు చేయమని తాము సూచించినా నాని విన్పించుకోలేదని వారు అంటున్నారు. అందుకే వైసీపీని వీడి తాము జనసేనలో చేరుతున్నామని పాలంకి బ్రదర్స్ చెప్పారు.
Next Story